Wednesday 3 May 2017

సోషల్ నెట్వర్క్ సైట్ లలో దిగ్గజ మైన యుట్యూబ్ ద్వార ఇంతకు ముందు వారు ఎలా సంపాదించారు? ఏమైనా 4 సూత్రాలు చెబుతారా?

సోషల్ నెట్వర్క్ సైట్ లలో దిగ్గజ మైన యుట్యూబ్ ద్వార ఇంతకు ముందు వారు ఎలా సంపాదించారు? ఏమైనా 4 సూత్రాలు చెబుతారా?   ముంబైకి చెందిన అనిషా ... thumbnail 1 summary
సోషల్ నెట్వర్క్ సైట్ లలో దిగ్గజ మైన యుట్యూబ్ ద్వార ఇంతకు ముందు వారు ఎలా సంపాదించారు? ఏమైనా 4 సూత్రాలు చెబుతారా?  
ముంబైకి చెందిన అనిషా దీక్షిత్‌:
ఓరోజు రిక్షా ఎక్కింది. ఖాళీగా ఉన్నాకదా, గమ్యాన్ని చేరేలోపు సరదాగా నాలుగు కబుర్లు చెప్పుకుంటూ యూట్యూబ్‌లో పెడదాం అనుకుని రిక్షాలో కూర్చుని ప్రయణిస్తూనే రోడ్డు మీద జరుగుతున్న రకరకాల సంఘటనలను వర్ణిస్తూ వీడియో తీసుకుని పోస్ట్‌ చేసింది. ఆ రిక్షా కబుర్లు చాలామందికి చాల కొత్తగా అనిపించాయి. అంతే, లైక్‌ల వర్షం వరదలా వచ్చాయి. ఆ స్ఫూర్తితో రిక్షా వాలీపేరుతో రోజుకో చోటుకి రిక్షాలో తిరుగుతూ ఫ్యాషన్‌, ఆహారం, మహిళల ఆత్మరక్షణ... ఇలా ఎన్నో విషయాల గురించి వీడియోలు తయారు చేసి అప్‌లోడ్‌ చెయ్యడం మొదలు పెట్టింది. మనం ఆలోచిస్తే ఎంత సరదాగా కాలక్షేపం చేసే పనది... కానీ అదే ఆమెకు నెల నెలా రూ.12లక్షల వరకూ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఇదే నండి సోషల్ మీడియా లో సరదాగ సంపాదించే సూత్రం 1.  


నొయిడాకు చెందిన యాభై ఆరేళ్ల నిషా మధులిక:
భర్త ఆఫీసుకని ఉదయం వెళ్తే సాయంత్రానికి గాని తిరిగి రాడు. పిల్లలు చదువుకోసము విదేశాలకు వెళ్లిపోయారు. ఆ ఒంటరితనాన్ని భరించలేక పోయిన ఆమె ఏం తోచక తనకు వచ్చిన వంటకాల తయారీని రాసుకోవడం మొదలుపెట్టింది. ఓ వంద అయ్యాయి. ఆమె ఆలోచన బ్లాగుల్లో పెట్టాలని. యూట్యూబులో పెట్టమని భర్త ప్రోత్సహించాడు. ఉదయం అల్పాహారంగా రోజుకో రకం వంటకం తయారు చేసి దాన్నే వీడియో తీసి,   యుట్యూబ్ లో పెట్టాలనీ నిర్ణయించుకున్నారు. అలా మొదటి వంటకం వీడియో 2011 మేలో అప్‌లోడ్‌ అయింది. సులభంగా చేసే వీలుండడంతోపాటు ఆ వంటకాలకు అమ్మచేతి కమ్మదనమూ తోడైంది. అతి కొద్దికాలంలోనే లక్షలమంది ఆమె ఛానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. అది చాలదూ సెలెబ్రిటీ హోదా రావడానికి. అంతే మరి ఈమె ఛానల్ జోరు అందుకుంది. ఆమె ఛానల్లో ప్రకటనలు ఇచ్చేందుకు చాలా వ్యాపార సంస్థలు ముందుకొచ్చాయని  యూట్యూబ్‌ యాజమాన్యం నుంచి మెయిల్‌ ఒకరోజు వచ్చింది. మధులిక వీడియోలను చూస్తున్నవారికి తమ ఉత్పత్తుల గురించిన ప్రకటనలు మద్యలో చూపి అందరిని ఆకట్టుకోవాలన్నది ఆయా వ్యాపార సంస్థల వ్యూహం మరి. ప్రస్తుతం ఆ ప్రకటనల ద్వారానే నెల నెలా దాదాపు 40 లక్షల రూపాయలు ఆమె బ్యాంకు అకౌంట్లోకి చేరుతున్నాయి. ఇలా... మనకు వచ్చిందీ నలుగురికీ నచ్చేదీ ఏదైనా సామాజిక వెబ్‌సైట్లలో పెట్టొచ్చు, సంపాదించొచ్చు. ఇదే నండి సోషల్ మీడియా లో సరదాగ సంపాదించే సూత్రం 2.  

బ్రిటన్‌కు చెందిన మూడేళ్ల పిల్లాడు హ్యారీ తండ్రి ఎమీ చేసాడో చూద్దాము:
చాలాసార్లు అనుకోకుండా తీసిన వీడియోలు కూడా కోట్లను కుమ్మరిస్తుంటాయి. అది యూట్యూబ్‌ ప్రారంభమైన కొత్తలో... బ్రిటన్‌కు చెందిన మూడేళ్ల పిల్లాడు హ్యారీ తమ్ముడి నోట్లో వేలు పెట్టి నాన్నా చార్లీ మళ్లీ నన్ను కొరికాడుఅని చెబుతున్న సందర్భాన్ని అనుకోకుండా వీడియో తీసిన తండ్రి దాన్ని యూట్యూబులో పెట్టాడు. కేవలం 56సెకెన్ల ఆ సరదా సన్నివేశాన్ని ఎంతోమందిని నవ్వించింది. అంతే వొక్కసారిగా ఉన్నట్లుండి ఆ చిన్నారులు సెలెబ్రిటీలైపోయారు. రెండు మూడేళ్లలో ఆ పిల్లలతో తీసిన వీడియోలు రూ.ఎనిమిది కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. నిమిషం కూడా లేని వీడియోలు  కోట్ల రూపాయలను కొల్లగొట్టిందంటే ఎంత ఆశ్చర్యం మరి..? ఇదే నండి సోషల్ మీడియా లో సరదాగ సంపాదించే సూత్రం 3.  

ఫెలిక్స్‌ అర్విడ్‌ను తండ్రి సరిగా చదువుకోలేదని బయటకు పంపివేసాడు అయితే అప్పుడు ఏమి చేసాడు?
నీపాటా లేకుండా ఎప్పుడూ ఆ ఫేస్‌బుక్‌లూ యూట్యూబులతోనే ఉండేవాడు.
యూట్యూబులో వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ తన కొడుకు సమయాన్ని వృథా చేసుకుంటున్నాడనే ఆవేదనతో ఫెలిక్స్‌ అర్విడ్‌ను తండ్రి ఎప్పుడూ నీకు అసలు బాగుపడే ఆలోచనే రాదా అని మందలిస్తుండేవాడు.   ఆఖరికి ఆ వీడియోల కోసం యూనివర్సిటీలో చదువును సగంలో వదిలేశాడని తండ్రికి తెలిసి కోపంతో కొడుకును ఇంట్లో నుంచి బయటకు పంపేశాడు.
అయిదేళ్ల తర్వాత... ఏడాదికి అక్షరాలా వంద కోట్ల రూపాయల ఆదాయం. మొత్తం సంపాదన విలువ అంతకు ఎన్నో రెట్లు ఎక్కువ. ఇదీ 27ఏళ్ల వయసులో ఫెలిక్స్‌ సాధించింది. 2016లో టైమ్‌ పత్రిక అత్యంత ప్రభావశీలురైన వ్యక్తులుగా ఎంపికచేసిన ప్రపంచంలోని వందమందిలో అతడూ ఒకడైన అదే కుర్రాడు... కేవలం అయిదేళ్లే తేడా... ఈమధ్య కాలంలో అతడేం చేశాడు...? అనే ప్రశ్నకు అప్పుడూ ఇప్పుడూ అతడు చేస్తున్న పని ఒక్కటే. అదే ప్యు డీ పీపేరుతో యూట్యూబులో రకరకాల కామెడీ వీడియోలను అప్‌లోడ్‌ చెయ్యడం. అతడిని ఇంతటి ఎదుగుదలకు తీసుకొని వచ్చినవి ఆ వీడియోలే. యూట్యూబులో ఫెలిక్స్‌ పెట్టిన వీడియోల్ని కొన్ని కోట్లమంది వీక్షిస్తున్నారు మరి. ఇదే నండి సోషల్ మీడియా లో సరదాగ సంపాదించే సూత్రం 4.  


యూట్యూబ్‌
యూట్యూబ్‌లో ఆదాయానికి ప్రధాన ఆధారం ప్రకటనలే. అయితే, దీనికోసం మనకు కచ్చితంగా యూట్యూబ్‌ ఛానల్‌ ఉండాలి. ఫేస్‌బుక్‌ అకౌంట్‌లా దీన్ని మనమే సులభంగా క్రియేట్‌ చేసుకోవచ్చు. ఆ ఛానల్‌ ద్వారా యూట్యూబ్‌లో పెట్టిన మన వీడియోని చూసేవారి సంఖ్య అయిదువేలకు చేరగానే పార్ట్‌నర్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. అప్పట్నుంచీ యూట్యూబ్‌ యాజమాన్యం మనం అప్‌లోడ్‌ చేసే వీడియోలకు ప్రకటనలను అనుసంధానిస్తుంది. అలా మన ఛానల్‌ ద్వారా ప్రకటనల్ని ఎంతమంది వీక్షకులు చూస్తే అంత డబ్బు మన అకౌంట్‌లో పడుతుంది.
ఎక్కువ సంపాదన వీరిదే...
ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం... ఏడాదికి వందకోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తున్న ఫెలిక్స్‌ యూట్యూబ్‌ ద్వారా అతి ఎక్కువ సంపాదిస్తున్న వారిలో మొదటి స్థానంలో ఉన్నాడు. యూట్యూబ్‌లో వెయ్యి కోట్ల వ్యూస్‌ వచ్చిన మొదటి ఛానల్‌ ప్యు డీ పీఅతడిదే. ప్రస్తుతం ఆ ఛానల్‌లోని వీడియోలకు వచ్చిన వ్యూస్‌ 14వందల కోట్లకు పైనే. ఇక, ఫెలిక్స్‌ ఛానల్‌కు సబ్‌స్క్రైబర్లుగా మారిన వారి సంఖ్య ఎప్పుడో అయిదుకోట్లు దాటిపోయింది.
*చుట్టూ ఉన్న జనాన్ని భయపెడుతూ చాటుగా ఆ తతంగాన్నంతా వీడియోలు తీయించే రోమన్‌ యాట్‌వుడ్‌(అమెరికా) ఏడాదికి రూ.52 కోట్లను సంపాదిస్తూ రెండోస్థానంలో ఉన్నాడు.
*ఎంతో డబ్బు ఖర్చుపెట్టి డిగ్రీ చదివాను. ఇప్పుడు యూట్యూబ్‌లో వీడియోలు రూపొందిస్తున్నాను. ఇదే నాకు ఆనందాన్నీ ఆదాయాన్నీ ఇస్తోంది మరి’... ‘సూపర్‌ ఉమెన్‌పేరుతో భారతీయ కెనడియన్‌ అమ్మాయి లిల్లీ సింగ్‌ నిర్వహించే యూట్యూబ్‌ ఛానల్‌ని క్లిక్‌ చెయ్యగానే కనిపించే మాటలివే. 170 కోట్ల వ్యూస్‌ ఉన్న ఆమె ఛానల్‌ ఏడాదికి రూ.49.5 కోట్లు సంపాదించి పెడుతూ యూట్యూబ్‌లో ఎక్కువ సంపాదించే వారిలో ప్రపంచంలోనే ఆమెను మూడోస్థానంలో నిలిపింది.
మనదేశంలో...
మొదట కాలక్షేపం కోసం వంటలు చేసి వీడియోలు అప్‌లోడ్‌ చేసిన నిషా మధులిక ప్రస్తుతం తన ఛానల్‌ద్వారా నెలకు రూ.40లక్షల వరకూ సంపాదిస్తూ తొలి స్థానంలో ఉంది.
*వారెవ్వా... షెఫ్‌గా మనందరికీ తెలిసిన సంజయ్‌ తుమ్మ రెండో స్థానంలో ఉన్నాడు. అతడి వంటల వీడియోలకు నెలనెలా వచ్చే ఆదాయం రూ.20 లక్షలకు వరకు ఉంటుందట. సంజయ్‌ వంటలకు 37కోట్లకు పైగా వ్యూస్‌ ఉన్నాయి.
*ట్రబుల్‌ సీకర్‌ టీమ్‌... కొంతమంది కుర్రాళ్లు నడుపుతున్న ఈ ఛానల్‌ ఆదాయం నెలకు రూ.17 లక్షలకు పైనే. సంపాదనలో మూడోస్థానం దీనిదే. రోడ్లమీదా వీధుల్లోనూ అపరిచితుల మధ్య ఏదో హంగామా సృష్టించి వీళ్లు తీసే వీడియోలను కోట్లమంది చూస్తున్నారు మరి.
తన కామెడీ వీడియోలతో సంచలనాన్ని సృష్టిస్తున్న తన్మయ్‌భట్‌ ఆదాయంలోనూ తొలి స్థానానికి పోటీ ఇస్తున్నట్లు తాజా సమాచారం. వీడియోలతో ఇలా నెల నెలా లక్షలు సంపాదిస్తున్నవారు భారత్‌లో ఇంకెందరో.

మరి మీరు కూడా సరదాగా సంపాదించడం మొదలు పెడుతున్నారా? మరి

 ***

No comments

Post a Comment