ప్రతి మనిషికి ఎదో ఒక టాలెంట్ వుంటుంది. అనగా సులబంగా మీరు ఏమిచేయ
గలరో (smartwork) ఆ ఇన్ఫర్మేషన్ ను అందరితో షేర్ చేసుకోవడం. అది అందరూ చేసే విదంగా
కాకుండా ఎంతో కొంత క్రొత్త దనాన్ని మీరు అ ఇన్ఫర్మేషన్ లో తెలియజేయగలగడం. అయితే ఈలా
తెలియచేయడానికి మీరు ముందు సోషల్ మీడియా వెబ్ సైట్లలో మీ ఈమెయిలు మరియు వ్రాస్తే ఫోన్
నెంబర్ కూడా వ్రాసి ఎకౌంటులు తయారు చేసుకోవాలి. తరువాత మీరు చెప్ప దలుచుకున్న
విషయాన్ని టైపు చేసి టెక్స్ట్ ద్వారా గాని, ఇమేజ్ ద్వారా గాని, వీడియో ద్వారా గాని
సోషల్ మీడియా వెబ్సైటు లలో పోస్ట్ చేసి తెలియ పరచవచ్చు. మీరు గమనించ వలసినది సామాజిక వెబ్‌సైట్లంటే
మూడు షేర్లూ ఆరు లైక్‌లే అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. మనం సరదాగా పెట్టిన ఒక్క
ఫొటో కూడా వొక్కొక్క సారి లక్షల్ని సంపాదించి పెట్టొచ్చు. అర నిమిషంలో తీసిన
వీడియో కూడా మనకు కోట్లను కుమ్మరించొచ్చు.
అసలు ఈతరానికి సోషల్ నెట్‌వర్కింగ్
సైట్లలో అకౌంట్ ఉండడం చాల ముఖ్యం అయిపొయింది. ఇప్పుడు
పరిస్థితి అలా మారింది. ఇక, పెట్టిన
ఫొటోకి లైక్‌లొస్తే పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినంత సంతోషం. ప్రతి పోస్టూ వారి దృష్టిలో ఓ పరీక్షే. ‘వీళ్లకు
ఇంత పిచ్చేంటిరా బాబూ’
అని కొంతమంది అనుకోవచ్చుగానీ
సామాజిక వెబ్‌సైట్లద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే ఉండాల్సిన ప్రధాన అర్హత ఇదే. సామాజిక వెబ్సైటు ల గురించి చదివి అర్థం
చేసుకొంటే సరిపోతుంది. అ సైట్ లోకి ఎలా ప్రవేసించాలో అందులో వున్న ఫంక్షనాలిటీ ఎలా
ఉపయోగించాలో తెలుస్తుంది. దీనికి ఏ విద్యా అర్హత ఉండ నవసరము లేదు. ఇంగ్లీష్ తెలిసి
తెలుగు వ్రాయ గలిగితే సరిపోతుంది. ఇంగ్లీష్ తెలిసి వుంటే ఇంకా మంచిది. విజ్ఞానం, వింత, వినోదం, ఆద్యాత్మికం...
విషయం ఏమిటన్నది కాదు,
మన పోస్టుని ఎంతమంది చూశారూ
ఎన్ని లైక్‌లు వచ్చాయి అన్నదే ముఖ్యం.
సోషల్ నెట్వర్క్ సైట్లు ఏమేమి వున్నాయి?
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్‌బుక్, పింటరెస్ట్... ఒక్కో సోషల్ నెట్‌వర్కింగ్
సైట్లలో ఆదాయ
మార్గాలు ఒక్కోలా ఉంటాయి. కానీ వాటి వెనుక ఉన్న అన్నిటి కాన్సెప్టు మాత్రం ఒకటే.
మన అకౌంట్‌కు లైక్‌ల వర్షం ఎంత ఎక్కువ కురిస్తే బ్యాంకు అకౌంట్లో డబ్బుల పంట అంత
బాగా పండుతుంది అనేది దాని సూత్రం. దీనికోసం అంద చందాలతో ప్రాముక్యం లేదు. మనం
మనలా ఉండొచ్చు. మనకు నచ్చిందీ, మనసుకు నచ్చిందీ, సరదాగా సంతోషంగా వ్రాస్తూనే సంపాదించొచ్చు.
***
No comments
Post a Comment