Saturday, 10 December 2016

నగదు రహిత లావాదేవీలు గురించి తెలుసుకుందాము!

తెలివిగా అడుగేస్తే చేతిలోనే పరిష్కారం  ప్రస్తుతము బారత ప్రభుత్వము 500/- మరియు 1000/- రూపాయల పాత నోట్లు రద్దు చేసి వాటికి బదులు క్రొ... thumbnail 1 summary
తెలివిగా అడుగేస్తే చేతిలోనే పరిష్కారం 
ప్రస్తుతము బారత ప్రభుత్వము 500/- మరియు 1000/- రూపాయల పాత నోట్లు రద్దు చేసి వాటికి బదులు క్రొత్త 2000/- నోటు ముంద్రించి పంపిణీ చేసిన విషయము మనందరికీ తెలిసినదే.
పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడ్డ కష్టాలను దాటాలంటే డెబిట్, క్రెడిట్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ లతోనె సాధ్యమని, అటువంటి కొరతను అదిగమించేందుకు నగదురహిత లావాదీవీలను ప్రబుత్వము ప్రోత్సహిస్తుంది. అయితే మనకు ఈ లావాదీవీలపై అవగాహన వుండాలి. ముందు మనము నగదురహిత లావాదీవీలు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాము.  

నగదురహిత లావాదీవీలు 4 రకాలుగ నిర్వహించ వచ్చు. e-Pass యంత్రాలు, SMS బ్యాంకింగ్, Internet బ్యాంకింగ్, Mobile బ్యాంకింగ్ మొబైల్ యాప్ తో (దీని కోసం స్మార్ట్ ఫోన్ వుండాలి) ల ద్వారా సద్యమౌతుంది.      

1. ePass యంత్రము ద్వారా: ఈ యంత్రముతో మీ బ్యాంకు లో డబ్బులుని వేరొకరి ఖాతాకు మీ బ్యాంకు డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డ్ నెంబర్ తో బదిలీ చేయవచ్చు.  అన్ని రకాల బ్యాంకు కార్డులు ఉపయోగించవచ్చు.                 
ePass యంత్రము ద్వారా బ్యాంకింగ్ సదుపాయము పొందాలంటే ఏమి చేయాలి
1. వినియోగ దారుని కార్డును ePass యంత్రము లో వుంచి, మనం సొమ్ము పంపాల్సిన వ్యక్తి ఖాతా నెంబర్ ను నమోదు చేయాలి.
2. తరువాత మన PIN నెంబర్ ను ఎంటర్ చేసి, గ్రీన్ బటన్ నొక్కితే సొమ్ము మనం పంపాల్సిన వ్యక్తి ఖాతాకు బదిలీ అయిపోతుంది.
ఉదా: ప్రముఖ దేవస్థానాలలో, రవాణా మరియు కొన్ని ముఖ్య ఆఫీసులలో బ్యాంకు సహాయముతో పంపిణి చేసారు.    
Note: మీరు ఏదైనా కొన్నప్పుడు ఆ ధర ఆ యంత్రములోకి  వస్తుంది.
Note: బ్యాంకు లో కూడా ఈ  ePass యంత్రము వుంటుంది అక్కడ ఎంత డబ్బు ట్రాన్స్ఫర్         చేయాలో చెబితే వారు టైపు చేసి పంపిస్తారు. 
Imp Note: ePass యంత్రము ద్వారా బ్యాంకింగ్ సదుపాయము పొందిన తరువాత ప్రింటెడ్ బిల్ వస్తుంది అది తీసుకొని ఎంత ట్రాన్స్ఫర్ అయినది మీ బ్యాంకు ఎకౌంటు లోనుంచి సరిగా చెక్ చేసుకోవాలి. పంపినందుకు రుసుము తీసుకుంటార లేదా అనేది ముందుగా తేలుకొని బ్యాంకు కార్డ్స్ ఉపయోగించాలి.

2. ఎస్.ఎం.యస్ బ్యాంకింగ్ ద్వారా: ఇంటర్నెట్ కనెక్షన్ లేని వారు సాదారణ ఫోన్ల (అనగా టచ్ స్క్రీన్ లేని మొబైల్) నుంచి కూడా ఎస్.ఎం.యస్ ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించవచ్చు. గ్రామాల్లో చాల మంది దగ్గర సాదారణ ఫోన్లు వుంటాయి.  sms బ్యాంకింగ్ అత్యంత సులభమైన మార్గం. 

SMS బ్యాంకింగ్ మి ఫోన్ ద్వార చేయలంటే ఏమి చేయాలి: (ఉదా: స్టేట్ బ్యాంకు)
1. ఏ బ్యాంకు లోనైనా మీ బ్యాంక్ ఖాతాను ఫోన్ నెంబర్ తో జతచేయాలి. 
2. IMPS, మొబైల్ ఫోన్ నెంబర్, MMID, పంపాల్సిన సొమ్ము వివరాలు, యూసర్ ID, MPIN, ఎందు కోసము మనీ పంపుతున్నమో వివరాలు తెలపాలి. 
3. వీటిని 20 అక్షరాలలో నింపవచ్చు.
IMPS: అంటే తక్షణమే డబ్బు చెల్లించే సేర్విసు.
MMID: అంటే మనం ఎవరికి డబ్బు చేల్లించాలో వారి గుర్తింపు సంఖ్య. ఒక రోజులో అత్యదికంగా ఎంత మార్పిడి చేయవచ్చు అనేది. 
పొరపాటున పంపిన డబ్బు వెనక్కి రప్పించుకొనే మార్గాలు ఒక్కో బ్యాంకు కు ఒక్కో విధంగా వుంటాయి.
4. బ్యాంకు ఖాతా లో ఇంకా ఎంత నగదు వున్నది, ఇంతకు మునుపు జరిపిన లావాదేవీలను కూడా sms బ్యాంకు లో తెలుసుకోవచ్చు.
      
3. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా: మీ బ్యాంకు అకౌంట్ కి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ వుంటే యూసర్ నేమ్, పాస్ వర్డ్ తో బ్యాంకు వెబ్ సైట్ లోకి వెళ్లి మీకు బ్యాంకు ఇచ్చిన ఇంటర్నెట్ ఖాతా ద్వారా మీ బ్యాంకు ఎకౌంట్ లో వున్న నగదు తక్షణమే వేరొకరికి నగదు బదిలీ చేయవచ్చును. అయితే మీరు ఉపయోగించే కంప్యూటర్ సిస్టం కి ఇంటర్నెట్ వుండాలి. అప్పుడు బ్యాంకు వెబ్సైటు ఓపెన్ అవుతుంది.
1. Internet Banking with Laptop

2. Internet Banking with Tab

ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావాలంటే కావలసినవి: (ఉదా: స్టేట్ బ్యాంకు)
1. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసము బ్యాంకుకి వెళ్లి యూసర్ నేమ్, పాస్వర్డ్ కోసము  అడగాలి.

2. ఖాతాదారుడు ఎవరకి డబ్బు పంపాలో వారి ఖాతా వివరాలు, వారి బ్యాంకు IFS Code ఎంటర్ చేయాలి.

3. ఈ వివరములు మన ఖాతా కు అనుసందానము అవుటకు బ్యాంక్స్ 24 గంటలు టైం పడుతుంది. కొన్ని బ్యాంక్స్ తక్కువ టైం తీసుకుంటాయి.

4. ఆ తరువాత నుంచి అనుసందానించు కున్న ఖాతాలకు ఎప్పుడైన సొమ్ములు జమ చేయవచ్చు.
  

4. బ్యాంకు మొబైల్ యాప్ ల ద్వారా: స్మార్ట్ ఫోన్(టచ్ స్క్రీన్ కలిగిన మొబైల్) ని వినియోగించి మీ బ్యాంకు యాప్(కేవలం మొబైల్ లో ఉపయోగించే అప్లికేషను ని యాప్ అంటారు) ను డౌన్ లోడ్ చేసుకొని మీ నగదు చెల్లింపును చేయవచ్చు. (దీనినే యుపిఐ మార్గముగా ఉపయోగించడము అంటారు)  దీనికోసము మీ స్మార్ట్ ఫోన్ లో వున్న సిమ్ కి ఇంటర్నెట్ సదుపాయము వుండాలి. అపుడు మొబైల్ యాప్ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.  
యాప్ ల ద్వారా వివిధ బ్యాంకుల ఖాతాలకు అనుసందానము కావచ్చు.  వినియోగ దారులు ఎలాంటి వివరాలు వెల్లడించకుండానే నగదు బదిలీ, స్నేహితుల మద్య సొమ్ము సర్దుబాటు, వొకే యాప్ ద్వారా బిల్లు లు,  నిత్యావసరాలు, కౌంటర్ చెల్లింపులు, చందాలు, వసూళ్ల పంపకాలు చేయవచ్చు.  

ముక్య విషయము:  ఈ సందర్బముగా మనం పిన్ నంబర్స్, వన్ టైం పాస్వర్డ్ లు నమోదు చేయవలసి వుంటుంది. వాటిని ఇతరుల కంట పడకుండా కాపాడుకోవాలి. 

ఉదా: ఆంధ్రాబ్యాంకు, యస్.బి.ఐ, ఐసీఐసీఐ బ్యాంకు మొబైల్ మీ బ్యాంకు యాప్ లను ఉపయోగించి, లావాదేవీలు నిర్వహించవచ్చు.

మె స్మార్ట్ ఫోనులో  మొబైల్ బ్యాంకింగ్ కావాలంటే  ఇలా చేయాలి: (ఉదా: స్టేట్ బ్యాంకు)
1. సంబందిత బ్యాంకు యాప్ ను మీ ఫోన్ లో  ఇన్స్టాల్ చేసుకోవాలి.
2. దానిలో వినియోగ దారునిగా నమోదు కావాలి.
3. దీని కోసం మన బ్యాంకు ఖాతా, కొన్ని వివరాలు ఇవ్వాలి.

బ్యాంకు వాలెట్ లు: SBI ebuddy, Andhra Bank M-P, ICICI-I mobile  ....etc

వాలెట్ బ్యాంకింగ్ యాప్ లు: Paytm, Freecharge, mobiquik, epurce, oxygen, Jio money .... taditarulu.

తెలుకోవలసిన జాగ్రత్తలు : 

  • రక్షణ తో వున్న బ్యాంకు యాప్ వెబ్ సైట్ లనే వాడాలి.
  • గుర్తింపు పొందిన యాప్ లనే వినియోగించాలి.
  • అనుమానస్పద లింకు జోలికి వేల్లకోడదు.
  • అనవసరపు ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలి.

Ex: మన చేతిలో ఏదైనా బ్యాంకు కార్డు వుంటే చాలు ఇంటిలోనించే కేవలం స్మార్ట్ ఫోన్ లో మనకు కావలసిన సామగ్రిని కొనుగోలు చేసుకొనే సదుపాయము వచ్చింది.
రానున్న సంవత్సరములలో, ఎటువంటి లావాదేవీలు అయిన కేవలము వొక కార్డుతో జరిగే వెసులు బాటు కలుగుతుంది. ఇప్పటికే నడుస్తుంది.

నగదు లావాదేవీలకు పేటిఎం, ఫ్రీఛార్జి, మెబిక్విక్, ఆక్సిజన్ వాలెట్, జియో మనీ, ఈ పర్స్ తదితర యాప్ లను ఉపయోగించవచ్చు.

ఆంధ్రా బ్యాంకుకు చెందిన ABKMPAY, chillar, e-passbook వంటి యాప్ లను ఉపయోగించి నగదు రహిత లావాదేవీలు చేయవచ్చు.

కొన్ని యాప్ లకి వన్ టైం పాస్వర్డ్ విదానము వుంటుంది. ఇలాంటి యాప్ లు సురక్షితము.  ప్రస్తుతము ఎంత new technology  ఉపయోగిస్తున్న, హ్యాకర్స్ అదేస్థాయిలో new technology ని అందుకొంటున్నారు. అందువలన ప్రతి 3 నెలలకు వొక సారి పాస్వర్డ్ లను మార్చటం మంచిది.

ముందు ముందు మీ మొబైలె - మీ మనీ గ ఉపయోగపడుతుంది.  అందువలన మొబైల్ జాగ్రత్త! 

అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుందాము:
నగదు రహిత లావదీవీలు జరిపే సమయములో అవగాహనతో పాటు జాగ్రత్తగా వుండటం అవసరము.
1. మీ బ్యాంకు కార్డు వెనకాల వున్న CVV నెంబర్ ను ఎవరికీ చెప్ప కోడదు. మరియు
2. మీ బ్యాంకు పాస్వర్డ్ ను ఎవరకి చెప్ప కోడదు. మరియు
3. ముక్యముగా మీ బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాము మీ ఎకౌంటు వెరిఫై చేయడానికి మీ కార్డు డీటెయిల్స్ కావాలి అని కార్డు వెనకాతల పిన్ నెంబర్, CVV నంబర్స్ అడిగి డబ్బులు మీ ఖాతా లోవి దొంగిలించడానికి, రాంగ్ కాల్స్ ఈ మద్య వస్తున్నాయి. ఆ కాల్స్ నుంచి జాగ్రత్త వహించి మీ బ్యాంకు కార్డు  పిన్ నెంబర్, CVV నంబర్స్ ఫోన్ లో గాని, ఎవరైనా అడిగినా కాని ఇవ్వకోడదు.
4. మీ ఇంటర్నెట్ బ్యాంకు ఎకౌంటు పాస్వర్డ్ మరియు ప్రొఫైల్ పాస్వర్డ్ లు కొన్ని బ్యాంకులు కలిగి వుంటాయి. మొత్తానికి బ్యాంకు పాస్వర్డ్ లు గురించి ఎవరికీ చెప్పకోడదు.  
*** 

No comments

Post a Comment