సోషల్
నెట్వర్క్ సైట్ లలో ఇన్‌స్టాగ్రామ్ ద్వార ఇంతకు
ముందు వారు ఎలా సంపాదించారు?
‘లెక్క ఎక్కువైనా పర్లేదు... తక్కువ కాకుండా చూసుకో...’ మగధీరలో డైలాగ్ మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఫొటోలను మాత్రమే షేర్ చేసుకునే వెబ్‌సైట్ ఇన్‌స్టాగ్రామ్‌ను వాడేవాళ్లు నాలుగు రాళ్లు సంపాదించాలనుకుంటే మాత్రం ఈ డైలాగ్‌ను గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇన్‌స్టాగ్రామర్లు తమ అకౌంట్‌ని అనుసరించే వారి యొక్క సంఖ్య వెయ్యికి తగ్గకుండా చూసుకుంటే ప్రకటనల కోసం పోస్ట్ చేసే ప్రతి ఫొటోకీ నాలుగు వేల నుంచి పదహారు వేల రూపాయలు సంపాదించొచ్చు. ‘ఈ- మార్కెటర్స్’ సంస్థ అధ్యయనం ప్రకారం 2016 సంవత్సరం నాటికే ప్రపంచంలోని మూడోవంతు ప్రజలు సామాజిక వెబ్‌సైట్లలో సభ్యులట. అంటే, దాదాపు ఆ సంఖ్య 230కోట్ల మంది అన్నమాట. ఏ వ్యాపారం గురించైనా ప్రచారం చేసుకునేందుకూ కొత్త వ్యాపారాల్ని సృష్టించుకునేందుకూ ఇంతకుమించిన వేదిక ఏముంటుంది! మరి. అందుకే, ‘మా ఉత్పత్తిని అమ్మి పెట్టండి’ అని పేరున్న హీరోని బ్రాండ్ అంబాసిడర్లుగా మార్చినట్లూ సామాజిక వెబ్‌సైట్లలో ప్రాచుర్యం పొందిన వాళ్లనూ ప్రచారకర్తలుగా మారుస్తున్నాయి వ్యాపార సంస్థలు. అందుకు అతిపెద్ద ఉదాహరణ ఇన్‌స్టాగ్రామే. దీని లో ఎవరి అకౌంట్‌కైనా వీక్షకులు ఎక్కువ ఉన్నారంటే వాళ్లు సెలెబ్రిటీలైపోయినట్లే. వివిధ సంస్థలు తమ ఉత్పత్తుల్ని ప్రచారం చేయించుకునేందుకు వారి వెనక క్యూ కడతాయి. కాస్తో కూస్తో పేరున్న సెలెబ్రిటీలకైతే ఆ క్రేజ్ మరీ ఎక్కువ. అమెరికన్ గాయని సెలీనా గోమెజ్ పోస్ట్ చేసిన ఓ ఫొటో ఆమధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద సంచలనమే అయింది. ఆ సైట్ రికార్డులోనే అతి ఎక్కువగా 58లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయట దానికి. కోకాకోలా బాటిల్లో స్ట్రా వేసుకుని తాగుతున్నట్లున్న సెలీనా ఫొటో అది. అసలే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ను అనుసరించే అభిమానులు ప్రపంచవ్యాప్తంగా పదికోట్లమందికి పైగా ఉన్నారు. దానికి తోడు ఆ ఫొటో ఇంత పెద్ద హిట్. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ఆ ఒక్క ఫొటో కోకాకోలాకు ఏ స్థాయిలో ప్రచారం చేసిపెట్టిందో. సెలీనా చేసే పోస్టులకు అంత డిమాండ్ ఉంది కాబట్టే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెతో ప్రచారం చేయించుకునేందుకు వ్యాపార సంస్థలు ఒక్క ఫొటోకి రూ.3.6కోట్లు చెల్లిస్తుంటాయి. ఇలా... రకరకాల ఆహార ఉత్పత్తులూ సౌందర్య లేపనాలూ దుస్తులూ బ్యాగులూ ఫ్యాషన్ ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ ఈ సామాజిక వెబ్‌సైట్ ద్వారా కోట్లను కూడబెడుతున్నవాళ్లెందరో.

ఇన్‌స్టాగ్రామ్
ఫొటోలను మాత్రమే పోస్ట్ చేసే ఈ వెబ్‌సైట్లో
ఎక్కువమంది అనుసరిస్తున్న వారిని తమ బ్రాండ్లకు ప్రచారకర్తలుగా ఉండమని కోరుతుంటాయి
కంపెనీలు. అలా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రాచుర్యం పొందిన వాళ్లు తాము పోస్ట్ చేసే
ఫొటోల్లో ఫ్యాషన్, ఆహారం,
ఫిట్‌నెస్...
ఇలా ఏ అంశం గురించైనా వ్యాపార సంస్థల తరఫున ప్రచారం చేసి ఆదాయం పొందే వీలుంటుంది.
ఈ సామాజిక వెబ్‌సైట్‌లో వెయ్యి నుంచి తొమ్మిది వేలమంది ఫాలోవర్లు ఉంటే ఒక్కో
పోస్ట్‌కి నాలుగు నుంచి 16వేలు సంపాదించొచ్చు. అనుసరించేవారు
పెరుగుతున్న కొద్దీ ఒక్కో పోస్ట్ విలువ లక్ష నుంచి కోటి రూపాయల వరకూ కూడా పెరిగే
అవకాశం ఉంది.
ఎవరి ఆదాయం ఎంత...
అమెరికన్ టీవీ తార కెన్డల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఏ ఫొటో పెట్టినా సగటున 13 లక్షల లైక్‌లు వస్తుంటాయట. అందుకే, ఆమె ఫొటోలో ఏదైనా బ్రాండ్ గురించి ప్రచారం చెయ్యాలంటే రూ.1.6 కోట్ల నుంచి రూ.6.5కోట్ల వరకు వసూలు చేస్తుందట. ఫాలోవర్ల సంఖ్యలోనే కాదు, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రపంచంలోనే ఎక్కువగా సంపాదించే లిస్టులో ఆమె తొలిస్థానంలో ఉంది.

*4.3 కోట్ల ఫాలోవర్లున్న హాలీవుడ్ కమెడియన్ కెవిన్ హార్ట్‌తో ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌లో
ప్రచారం చేయించుకోవాలనుకుంటే ఒక్క ఫొటోకి రూ.6కోట్లు చెల్లించాల్సిందేనట. అతి ఎక్కువ
ఆదాయాన్ని పొందే రెండో ఇన్‌స్టాగ్రామర్ అతడే.
*హాలీవుడ్ గాయని సెలీనా గోమెజ్ ఏదైనా బ్రాండ్ గురించిన ఒక్క ఫొటో పోస్ట్ చేసిందంటే ఆమె అకౌంట్లో రూ.3.6 కోట్లు చేరినట్లే. అందుకే, ఆమె మూడో స్థానంలో ఉంది.

మనదేశంలో...
మనదగ్గర ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువమంది అనుసరించేది సినిమా వాళ్లనే. అందులోనూ బాలీవుడ్ హీరోయిన్‌లు దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రా, శ్రద్ధా కపూర్‌లవే తొలి మూడు స్థానాలు. సినిమా విశేషాలూ రోజువారీ పనులూ పార్టీలూ... ఇలా రకరకాల ఫొటోలతో దర్శనమిస్తూ వీళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఎవర్ గ్రీన్ తారలైపోయారు. 1.8 కోట్ల మంది ఫాలోవర్లతో దీపికా పదుకొణె, 1.5 కోట్ల అభిమానులతో ప్రియాంకా చోప్రా, 1.4 కోట్లు మందితో శ్రద్ధాకపూర్ ఇన్‌స్టాగ్రామ్‌ను ఏలేస్తున్నారు. మార్కెట్ వర్గాల లెక్కల ప్రకారం వీళ్లు ఏదైనా బ్రాండ్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చెయ్యాలంటే ఒక్కో ఫొటోకి రూ.50లక్షలకుపైనే వసూలు చేస్తారట.

No comments
Post a Comment