మిగిలిన వాటిలో
సంపాదించాలనుకోవడం ఉద్యోగం చెయ్యడంలాంటిదైతే ఫేస్‌బుక్‌లో ఆదాయ మార్గం వెతుక్కోవడం
సొంతంగా సంస్థను స్థాపించాలనుకోవడం లాంటిది. సొంతవ్యాపారాన్ని అభివృద్ధి
చేసుకోవడానికి ఫేస్‌బుక్‌ని మించిన ప్రచార సాధనం లేదన్నది మార్కెట్ వర్గాల
అభిప్రాయం. ఈ సామాజిక వెబ్‌సైట్ వచ్చాక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లు
చాలామంది సొంతంగా వెబ్‌సైట్లు డిజైన్ చేయించుకోవడం మానేశారు. వేలూ లక్షలూ
ఖర్చుపెట్టి వెబ్‌సైట్లు డిజైన్ చేయించుకుని మళ్లీ దానికి డొమైన్ నేమ్
కొనుక్కుని, ఆ వెబ్‌సైట్‌ని
నిర్వహించుకుంటున్నందుకు గూగుల్ సంస్థకు ఏటా కొంత మొత్తాన్ని చెల్లించడం... అదో
పెద్ద తతంగం. వ్యాపారం నడిచినా నడవకపోయినా ఇదంతా చెయ్యాలి. అయినా ఆ వెబ్‌సైట్‌ను
జనం చూస్తారో లేదో తెలియదు. అదే ఫేస్‌బుక్‌లో అయితే, రూపాయి
ఖర్చుపెట్టకుండా అకౌంట్ తెరిచి మన వ్యాపారానికి సంబంధించిన సమాచారం మొత్తాన్నీ
ఫొటోలతో సహా అందులో ఉంచొచ్చు. అర్ధరూపాయి కూడా ఖర్చుపెట్టేపనిలేకుండా స్నేహితులూ
బంధువులూ వారి స్నేహితుల ద్వారా అదే ప్రాచుర్యం పొందుతుంది. వనస్థలిపురానికి
చెందిన ప్రియాంక ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. రకరకాల డిజైనర్ దుస్తుల్ని
కుట్టడంలో స్థానికంగా మంచి పేరు కూడా ఉంది. కానీ తన వ్యాపారాన్ని విస్తరించేంత
ఆర్థిక స్తోమత లేదు. చివరికి స్నేహితుల సలహాతో ఆమె డిజైన్లు ఫేస్‌బుక్
గోడలమీదికెక్కాయి. అంతే, బోలెడన్ని
లైక్‌లూ షేర్లూ. వాటితో పాటే, తమకూ
అలాంటివి కావాలంటూ ఆర్డర్లూ... ఇప్పుడామెకు హైదారాబాద్‌లోనే కాక ఇతర నగరాల నుంచీ
వినియోగదారులున్నారు. ఆ బొటిక్ టర్నోవర్ లక్షల్లోకి చేరింది. ఆ విజయం వెనుక
ఉన్నది ముమ్మాటికీ ఫేస్‌బుక్కే. ఎవరికి వారే కాకుండా, ఇతర వ్యక్తులూ సంస్థల కోసం అకౌంట్లు
సృష్టించి అవి ప్రాచుర్యం పొందేలా చేసినా ఆదాయం వచ్చినట్లే. తమకు ప్రచారం కలిగేలా
చెయ్యమంటూ ప్రజా ప్రతినిధులతో పాటు, పార్టీలూ
వ్యాపార సంస్థలూ ప్రత్యేకంగా ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి కూడా.
ఓ
అధ్యయనం ప్రకారం స్మార్ట్ ఫోన్లను వాడేవారిలో 80శాతం
మంది రోజూ నిద్రలేవగానే చేసే పనుల్లో ఒకటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో అప్‌డేట్లను
చూసుకోవడమేనట. అవును,
నిద్రలేవడం, టిఫిన్‌చెయ్యడం, ఆఫీసుకెళ్లడంలాగే ఫోన్‌లో సామాజిక
వెబ్‌సైట్లను చూడటం కూడా రోజువారీ పనుల్లో భాగమైపోయింది. అందుకే, ఇపుడు ప్రతి వ్యాపారమూ వాటి చుట్టూనే
తిరుగుతోంది. అలా అని ఈతరాన్ని తక్కువ అంచనా వెయ్యడానికి లేదు. అన్నీ లైట్
తీసుకున్నట్లే ఉంటారు కానీ దేన్లోనూ బాధ్యత మర్చిపోరు. సరదా కోసమైనా సమయాన్ని మరీ
ఎక్కువ వృథా చేసుకునే టైపు కాదు. అందుకే, వాళ్లను
తమ వ్యాపారంలో భాగస్వాముల్ని చెయ్యడానికి సామాజిక వెబ్‌సైట్లలో స్నేహితులతో
పిచ్చాపాటీ చెబుతూనే బ్యాంకు బ్యాలెన్సును పెంచుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి
కంపెనీలు.
అర్థమైందిగా...
సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్లంటే లైక్‌లూ షేర్‌లే కాదు, ఆదాయానికి అక్షయపాత్రలు కూడా.
***
No comments
Post a Comment